Breaking News

టీఎస్‌ఎస్పీ లీవ్‌ మాన్యువల్‌ మార్చడం దుర్మార్గం

Published on Wed, 10/16/2024 - 03:16

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్పీ)లో నవంబరు ఒకటో తేదీ నుంచి అమలు కానున్న కొత్త లీవ్‌ మాన్యువల్‌ దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధానసంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై హరీశ్‌రావు ‘ఎక్స్‌’వేదికగా ఘాటుగా స్పందించారు. నెలరోజుపాటు కుటుంబాలకు దూరంగా ఉంచడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. పాత విధానంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి పంపే విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సివిల్, ఏఆర్‌ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందన్నారు. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్‌ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్‌ లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ పెండింగ్‌ డబ్బులు చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ వెంటనే క్లియర్‌ చేయాలని, సివిల్‌ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం రేవంత్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానిస్టేబుళ్ల సంక్షేమం గురించి మాట్లాడి, అధికారమొచ్చాక శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం పది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు యజమాని తాళం వేసే పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరుకుందన్నారు. రోజురోజుకు దిగజారిపోతున్న విద్యారంగంపై సీఎం దృష్టి సారించాలని చెప్పారు.
 
లీవుల్లో ఎలాంటి షరతుల్లేవు: ఎస్‌కే జైన్, ఏడీజీ (టీఎస్‌ఎస్పీ) 
టీఎస్‌ఎస్పీ సిబ్బందికి సెలవుల జారీలో ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని టీఎస్‌ఎస్పీ ఏడీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ ఒక ప్రకటన విడుదలలో తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న కథనంపై ఆయన స్పందించారు. అందరిలాగే వారికి కూడా సీఎల్స్, ఈఎల్స్‌ అన్నీ అడిగిన వెంటనే ఎలాంటి ఆంక్షల్లేకుండా ఇస్తున్నామన్నారు. 

మిగిలిన డిపార్ట్‌మెంట్లలా ఆదివారం వారాంతపు సెలవు కుదరని నేపథ్యంలో వారికి ఒకేసారి నాలుగురోజులపాటు రికార్డెడ్‌ పరి్మషన్‌ (ఆర్పీ) కింద సెలవు అనుమతిస్తున్నామని వివరించారు. ఈ సదుపాయం సివిల్, ఏఆర్, ఇతర ఏ పారా మిలటరీలోనూ లేదని గుర్తు చేశారు. సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)