త్వరలో ‘సౌర’ టెండర్ల ఖరారు!

Published on Thu, 01/09/2025 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆధ్వర్యంలో సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పిలిచిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకుగాను ఎస్‌హెచ్‌జీల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సహాయం కోసం ఎస్‌హెచ్‌జీలను బ్యాంకులతో సమన్వయం చేయాలని కోరారు. 

ఎస్‌హెచ్‌జీల ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు గతేడాది సెప్టెంబర్‌లో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ కార్యక్రమం పురోగతిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి బుధవారం ప్రజాభవన్‌లో జిల్లా కలెక్టర్లతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మెగావాట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకి 4 ఎకరాలు చొప్పున ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. 

ఇందుకుగాను దేవాదాయ, నీటిపారుదల శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.  ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూములు సేకరించాలని భట్టి ఆదేశించారు. వీటితో ఎస్‌హెచ్‌జీలు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకి 4–5 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. 

అటవీ భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్న గుట్టలతో పాటు నగరాల్లో భారీ భవంతులపై సౌర విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

గిరిజనులకు భూమి ఎక్కువగా ఉన్నా ఆదాయం తక్కువగా ఉంటుందని, అచ్చంపేట నుంచి ఆదిలాబాద్‌ వరకు గోదావరి పరీవాహకంలోని భూములపై దృష్టిపెడితే వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, లోకేశ్, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ పాల్గొన్నారు. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)