Breaking News

‘అధిక పెన్షన్‌’పై తొలగని సందేహాలు!

Published on Sat, 04/29/2023 - 02:30

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అధిక పెన్షన్‌ పథకం కోసం ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినా.. దీనిపై చందాదారులు, పెన్షనర్లలో సందేహాలు వీడటం లేదు. ఫిబ్రవరి 20న అధిక పెన్షన్‌ దరఖాస్తులకు ఉత్తర్వులను వెలువరించగా.. దరఖా స్తు ప్రక్రియ, ఉమ్మడి ఆప్షన్‌ నమోదు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధి, ఇతర అంశాలపై అయోమయం వీడటం లేదు. అధిక పెన్షన్‌ లెక్కించే ఫార్ము లాను ఈపీఎఫ్‌ఓ ఇంకా వెల్లడించలేదని.. దీనికి ఎంపికైతే జరిగే లబ్ధిపై ఎలాంటి స్పష్ట త లేదని చందాదారులు వాపోతున్నారు. 

ఈపీఎఫ్‌ఓ ప్రస్తుత నిబంధనల ప్రకా రం రూ.15 వేల గరిష్ట వేతనాన్ని పెన్షన్‌ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వేతన పరిధిలోని వారికి పదవీ విరమణ పొందిన తర్వాత సాధారణ పెన్షన్‌ మాత్రమే అందుతుంది. ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి ముందు నుంచీ ఉన్న చందాదారులకు కూడా దీన్ని వర్తింపజేశారు. దీంతో అధిక వేతనమున్న వారికి అధిక పె న్షన్‌ పొందే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది.

ఈ క్రమంలో.. ఈ నిబంధన అమల్లోకి రాకముందే అధిక వేతనం పొందుతున్న చందాదారులు, పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్‌ అందే అవకాశం ఇవ్వా లని కోర్టు ఈపీఎఫ్‌ఓను ఆదేశించింది. దీని తో ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్‌కు ఆప్షన్‌ ఇచ్చింది. గరిష్ట వేతనంపై అటు చందాదారుడు, ఇటు యాజమాన్యం చెరో 12శాతం చొప్పు న చందా చెల్లిస్తే.. అధిక పెన్షన్‌కు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంలో పలు సందేహాలున్నాయి.

కొన్ని కంపెనీలు ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితికి లోబడి జీతాల చెల్లింపులు చేస్తూ వచ్చాయి. అలాంటి వారి కి అధిక వేతనంపై చెల్లింపులు చేసే అంశంపై స్పష్టత లేదు. ఇక అధిక వేతనం పొందుతున్న చందాదారులకు ప్రభుత్వం వాటా 1.12 శాతాన్ని ఈపీఎఫ్‌లో జమచేసే అంశంపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం జమచేయని పక్షంలో ఆ మొత్తాన్ని ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు ఈపీఎఫ్‌ఓ దగ్గర సమాధానం లేదు. 

‘అధిక పెన్షన్‌’ఫార్ములా ఇంకెప్పుడు? 
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పెన్ష న్‌కోసం ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్‌ లింకు ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖా స్తు చేసుకున్నవారు.. చందాకు సంబంధించి యాజమాన్యంతో కలసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పూర్తిస్థాయి ఆధారాలను సమర్పించాలి. దీనికి మే 3వ తేదీవరకే గడువు ఉంది.

ఇలా సమయం ద గ్గరపడుతున్నా.. అధిక పెన్షన్‌ లెక్కింపునకు సంబంధించిన సూత్రాన్ని (ఫార్ములా) ఈపీఎఫ్‌ఓ ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో అధి క పెన్షన్‌ అర్హతలు, ఎంపికైతే వచ్చే లబ్దిపై చందాదారులకు ఇప్పటికీ స్పష్టత లేదు. కొ న్ని సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు అధిక వేతనంపై ఈపీఎఫ్‌ జమ చేస్తున్నా.. అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. ఇలాంటి సందేహాలను ఈపీఎఫ్‌ఓ అధికారుల దృష్టికి తీ సుకువెళుతున్నా.. ఎలాంటి స్పందన లేదని చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు