Breaking News

‘అన్నా నాకిక దిక్కెవరూ’

Published on Wed, 10/23/2024 - 10:47

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై తోడునీడగా ఉన్న అన్న మృతితో 11 ఏళ్ల బాలిక ఒంటరైంది. ‘అన్నా నాకిక దిక్కెవరూ’ అని ఏడుస్తూ అన్న మృతదేహానికి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. 

ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన నాయిని రాజేశం– దేవవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వందన, సంజన, కొడుకు వంశీ (25) సంతానం. ఉపాధి కోసం రాజేశం దుబాయ్‌ వెళ్లేవాడు. ఉన్నంతలో పెద్ద కూతురు వందనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది క్రితం రాజేశం దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికే దేవవ్వ కేన్సర్‌ బారినపడి మృతిచెందింది. 

ఆమె దహనసంస్కారాలు జరిగిన మూడు రోజులకే దుబాయ్‌ నుంచి రాజేశం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతడి అంత్యక్రియలను కొడుకు నిర్వహించాడు. అప్పటి నుంచి సంజన ఆలనపాలనను వంశీ చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి ఏడాది అవుతుండగా, మంగళవారం వంశీ సైతం కిడ్నీలు పాడయి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సంజన ఒంటరయింది. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో అన్నకు తలకొరివి పెట్టడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు.

    

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు