Breaking News

పట్టాలెక్కిన సికింద్రాబాద్‌– డెయిరీఫామ్‌ ప్రాజెక్ట్‌

Published on Sat, 08/09/2025 - 18:26

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు నిర్మించనున్న 5.4 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం భూ సామర్థ్య పరీక్షలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో అన్ని రకాల ప్రాథమిక పనులు పూర్తి చేసుకొని పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును  పూర్తి చేయాలనేది లక్ష్యం.

కారిడార్‌ మార్గంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ (Begumpet Air Port) వద్ద సుమారు 600 మీటర్ల దూరం నిర్మించనున్న టన్నెల్‌కు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి అనుమతి లభించింది. ప్యారడైజ్‌ నుంచి సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీఫామ్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ అయ్యే ఖర్చులతో కలిపి ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1550 కోట్లు అవుతుందని అంచనా.

కంటోన్మెంట్‌లో ప్రహరీ నిర్మాణం.. 
సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ మార్గంలో రక్షణ శాఖకు చెందిన ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ప్రహరీ నిర్మాణం చేపట్టింది. రక్షణశాఖ నుంచి దాదాపు 113.48 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో చేపట్టనున్న కారిడార్‌ పనులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ గోడ ఒక సరిహద్దులా  ఉపయోగపడనుంది. సుమారు 10 కి.మీ. వరకు ప్రహరీని నిర్మించే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా.

కాగా.. రెండు భారీ మంచినీటి రిజర్వాయర్లను సైతం హెచ్‌ఎండీఏ నిర్మించి ఇవ్వనుంది. పనులు వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ మార్గంలోనూ హకీంపేట్‌ (Hakimpet) ఎయిర్‌ఫోర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ వద్ద  500 మీటర్ల టన్నెల్‌ నిర్మించనున్నారు. 

చ‌ద‌వండి: రాజీవ్ ర‌హ‌దారిలో ఖాళీ అవుతున్న దుకాణాలు

ఇది పూర్తిగా ఎలివేటెడ్‌ పద్ధతిలోనే నిర్మించనున్నప్పటికీ  విమానాల రాకపోకలకు  ఇబ్బందులు లేకుండా సొరంగ మార్గం ఉంటుంది. దాదాపు రూ.2 వేల కోట్ల (పరిహారం చెల్లింపుతో సహా) నిర్మాణ అంచనాలతో ఈ కారిడార్‌కు హెచ్‌ఎండీఏ (HMDA) ప్రతిపాదనలు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు  పేర్కొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)