Breaking News

Hyderabad: గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే

Published on Sun, 02/16/2025 - 12:05

గచ్చిబౌలి: అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం టీజీఎస్‌పీడీసీఎల్‌ గచ్చిబౌలి ఆపరేషన్స్‌ విద్యుత్‌ ఏడీఈ కె.సతీష్‌ కార్యాలయంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని టేబుల్‌ డెస్‌్కలో రూ.50 వేలను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. 

గచ్చిబౌలి డివిజన్‌లోని గోపన్‌పల్లిలో ఓ ఇంట్లో ట్రాన్స్‌ఫార్మర్, సీటీ మీటర్‌ బిగించడానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్‌ శివారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఈ సతీష్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో మొదట రూ.25 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.50వేలు శుక్రవారం అందించగా తీసుకొని టేబుల్‌ డెస్క్‌లో పెట్టారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేయగా కెమికల్‌తో కూడిన డబ్బులు డెస్‌్కలో దొరకడంతో స్వా«దీనం చేసుకొని సతీష్‌ ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. 

రూ. 100 కోట్లకుపైనే అక్రమాస్తులు 
హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు సదరు అధికారికి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 

అవినీతి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు అందించాలి..  
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.  సోషల్‌ మీడియా వాట్సప్‌ నంబర్‌ 94404 46106కు సైతం సమాచారం అందించవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు.  

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?