Breaking News

త్వరలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ

Published on Thu, 01/29/2026 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విస్క్‌ సంస్థ స్వయంచాలకంగా పనిచేసే తొలి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ అభివృద్ధి దశలో కీలక ముందడుగు వేసింది. పైలట్‌ అవసరం లేకుండా ప్రయాణించగల ఈ విమానం పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఎయిర్‌ ట్యాక్సీ పూర్తిగా అటానమస్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. వింగ్స్‌ ఇండియా–2026లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  

15 నిమిషాల టర్న్‌ అరౌండ్‌ టైమ్‌.. 
విమానంపై అమర్చిన ఆధునిక సెన్సర్లు గాల్లోని ఇతర విమానాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పైలట్‌ ఉన్నట్లే పరిసరాలను ‘ఎలక్ట్రానిక్‌ విజన్‌’ ద్వారా చూసే ఈ సిస్టమ్‌ ల్యాండింగ్‌ సమయంలో నేలను సైతం గుర్తించి భద్రంగా దిగేలా చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా మానవ జోక్యం లేకుండానే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. 

ఈ స్వయంచాలక టెక్నాలజీ వల్ల ఒకే గగనతలంలో ఎక్కువ విమానాలు ఒకేసారి ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాంతో అధిక సంఖ్యలో విమానాలు నిర్వహించవచ్చు. ప్రతి ప్రయాణం అనంతరం కేవలం 15 నిమిషాల టర్న్‌ అరౌండ్‌ టైమ్‌తో మళ్లీ సేవలకు సిద్ధం చేయాలన్నది సంస్థ లక్ష్యం. 

పూర్తిగా ఎలక్ట్రిక్‌ శక్తితో పనిచేసే ఈ ఎయిర్‌ ట్యాక్సీ కోసం వేగవంతమైన చార్జింగ్‌ టెక్నాలజీని కూడా ‘విస్‌్క’ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా నగరాల మధ్య రోడ్డు ట్రాఫిక్‌ తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వైద్య సరఫరాలు వంటి అత్యవసర సేవలను వేగంగా చేరవేయొచ్చని సంస్థ చెబుతోంది.  

‘ఈ దశాబ్దం ముగిసేలోపు అమెరికాలో ఎఫ్‌ఏఏ సర్టిఫికేషన్‌ పూర్తిచేసి, ముందుగా అమెరికాలో సేవలు ప్రారంభిస్తాం. అనంతరం భారత్‌ వంటి ఇతర మార్కెట్లకు విస్తరించాలన్నది మా ప్రణాళిక. భారత్‌లో వసతులు అద్భుతంగా ఉన్నాయి.. ఎయిర్‌ కండిషనింగ్‌ నుంచి తయారీ ప్రమాణాల వరకు అన్నీ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ చూసిన కొన్ని ఉత్పత్తులను అమెరికాలోని మా బృందానికి సూచించాలనుకుంటున్నాను’’ అని విస్క్‌ ఆసియా పసిఫిక్‌ ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఫిలిప్‌ స్విన్స్‌బర్గ్‌ చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)