Breaking News

TG: రేషన్‌కార్డుల పోర్టల్‌కు బ్రేక్‌.. కారణమిదే

Published on Sat, 02/08/2025 - 18:26

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్‌లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈసీ బ్రేక్ వేసింది.రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆన్‌లైన్‌లో ఇటీవలే పౌరసరఫరాల శాఖ ఒక ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసింది.రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ శనివారం(ఫిబ్రవరి 8) ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈసీ ఆదేశాలతో రేషన్ కార్డుల ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేసింది.కాగా, తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.కొత్తగా రేషన్‌కార్డుకు అర్హత పొందిన వారి జాబితాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం టీచర్లతో పాటు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ప్రభుత్వం ఎలాంటి కొత్త స్కీమ్‌లను అమలు చేయరాదన్న నిబంధనలున్నాయి. దీనిలో భాగంగానే రేషన్‌కార్డుల పోర్టల్‌ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)