Breaking News

విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత?

Published on Wed, 06/25/2025 - 04:10

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల పఠనాసక్తి, వారిలోని సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని బేస్‌లైన్‌ టెస్ట్‌గా చెబుతున్నారు. పరీక్ష నిర్వహణ, విద్యా సామర్థ్యాల పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్‌సీఈఆర్‌టీ మంగళవారం జిల్లా అధికారులకు పంపింది. 

ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీటిని నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడుసార్లు జరిగే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, చివరలో ఇంకోసారి పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్‌గా జరిగే పరీక్షలకు ఇవి భిన్నంగా ఉంటాయనిఅధికారులు తెలిపారు. 

పాఠశాలహెచ్‌ఎంలు ప్రతీ విద్యార్థికి సంబంధించిన మార్కులను యాప్‌లో పొందుపరుస్తారు. వీటి ఆధారంగా విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు? ఏ జిల్లాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఎస్‌సీఈఆర్‌టీ పరిశీలించి, విద్యార్థుల స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.

పరీక్ష విధానం ఇదీ.. 
ఈ ప్రక్రియ మొత్తం ఎస్‌సీఈఆర్‌టీ నేతృత్వంలోనే నడుస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి పరిశీలన ఈ విభాగమే చూస్తుంది. ఇది తరగతి వారీగా మారుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో అనర్గళంగా చదవడం, రాయడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి. దీని ఆధారంగానే పరీక్ష నిర్వహిస్తారు. పిల్లలు సరళ పదాలు, గుణింతాలు ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను చదవాలి. 

తెలుగు పదాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో చదివితేనే ఆ విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్యలు గుర్తించడం కూడికలు, తీసివేతలు సమస్యల సాధన, 3, 4, 5 విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారం వంటివి చేయాలి. 6–10వ తరగతి వారికి పాఠ్యాంశాల్లో కనీస ప్రశ్నలు వస్తాయి. 

ఇందులో విద్యార్థి ఎంత వేగంతో సమాధానం ఇస్తున్నాడు? ఇచ్చేదాంట్లో సరైన సమాధానం శాతం ఎంతమేర ఉందనే దాన్ని సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటారు. 9, 10 తరతుల విద్యార్థులను కొంత తికమక పెట్టే రీతిలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు, సంవత్సరంలో నిర్వహించే పరీక్షలకు ఏ సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)