Breaking News

హైదరాబాద్‌: రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు

Published on Mon, 11/24/2025 - 18:55

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు జరిగాయి. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్‌తో సహా మొత్తం ఎనిమిది సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాకర్ల శ్రీనివాస్, అనుబంధ సంస్థలపై PMLA, 2002 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రీలాంచ్‌ స్కీమ్‌ పేరిట గృహ కొనుగోలుదారులను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టై.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే.. 

ఈ స్కాంతో లింకుల నేపథ్యంలో ఎనిమిది రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో తాజాగా తనిఖీలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ నగదు చలామణి.. మనీలాండరింగ్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  సోదాల సమయంలో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)