Breaking News

శంషాబాద్‌లో హైడ్రామా.. ఫాల్కన్ ‌స్కాం అమర్‌దీప్ ఫ్లైట్‌ సీజ్‌

Published on Sat, 03/08/2025 - 09:30

సాక్షి, హైదరాబాద్‌: ఫాల్కన్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చార్టెర్డ్‌ ఫ్లైట్‌ను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. దీంతో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, ఫ్లైట్‌లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. పెట్టుబడుల పేరిటి రూ.850 కోట్లు స్కామ్‌ ఫాల్కన్‌ కంపెనీలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.14 కోట్లతో కంపెనీ చైర్మన్‌ అమర్‌దీప్‌ చార్టెర్డ్‌ ఫ్లైట్‌ను కొనుగోలు చేశారు. ఇక, తాజాగా చార్టెడ్‌ ఫ్లైట్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో సదరు చార్టెడ్‌ ఫ్లైట్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ పర్మిషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు.. ఈడీకి సమాచారం ఇచ్చారు.

దీంతో, రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. చార్టెడ్‌ ఫ్లైట్‌ను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఉన్న వారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక, ఈ కేసులో ఫాల్కన్‌ కంపెనీ చైర్మన్‌ అమర్‌దీప్‌ సహా మరికొందరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరందరికీ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

స్కామ్‌ ఇదే.. 
ఫాల్కన్‌ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పేరుతో మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసింది. ఫాల్కన్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ కంపెనీ డైరెక్టర్‌ కావ్య నల్లూరి, బిజినెస్‌ హెడ్‌ పవన్‌ కుమార్‌ ఓదెలను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)