Breaking News

తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి 

Published on Sun, 08/06/2023 - 02:13

గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్‌ మల్లిఖార్జున్‌ గౌడ్‌ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్‌ గార్డ్స్‌ అనే నినాదంతో మల్లిఖార్జున్‌ గౌడ్‌ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు.

ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్‌ మోహన్, మల్లిఖార్జున్‌ గౌడ్‌లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు.

మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్‌ గౌడ్‌ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు.  మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)