Breaking News

విజయదశమిపై అయోమయం

Published on Sat, 10/21/2023 - 02:16

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్‌ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.

దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి.

దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్‌ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి.

ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్‌ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు