Breaking News

Hussain Sagar: ‘90 ఎంఎల్‌’ ఇస్తేనే బయటకు వస్తా!

Published on Thu, 02/29/2024 - 07:40

సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ డ్రంకెన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లో దిగి పోలీసులకే చుక్కలు చూపించాడు. ‘90’ ఇస్తేనే బయటకు వస్తానంటూ ముప్పతిప్పలు పెట్టాడు. గత నెల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

జనవరిలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్యాంక్‌బండ్‌ పై నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. ఇతడు నడుము లోతు నీళ్లు ఉన్న ప్రాంతంలో నిల్చుని ఉండటాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటకులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అగి్నమాపక శాఖ అధికారులనూ రప్పించారు. ట్యాంక్‌బండ్‌ మీది నుంచి తాడు వేసిన ఓ కానిస్టేబుల్‌ అది పట్టుకుని పైకి రావాల్సిందిగా ఆ యువకుడిని కోరాడు. ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్లవద్దని, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు. 

ఈ విషయాన్ని సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో సదరు కానిస్టేబుల్‌ ‘నీకు ఏం కావాలి?’ అంటూ ఉర్దూలో ఆ యువకుడిని అడిగాడు. దీనికి సమాధానంగా ‘90 (ఎంఎల్‌ పరిమాణంలో మద్యం) ఇస్తేనే బయటకు వస్తా’ అంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనేక మంది దీన్ని వీడియో తీశారు. ఓ నెటిజనుడు బుధవారం దీన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ రోజు దాదాపు గంట కష్టపడిన తర్వాత పోలీసులు ఆ యువకుడిని బయటకు రప్పించగలిగినట్లు తెలిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)