Breaking News

ముందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. పగటి పూటా జాగ్రత్తే!

Published on Thu, 07/17/2025 - 10:21

సాక్షి, హైరదాబాద్‌: నగరంలో డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు ఏ సమయంలో ఎక్కడెక్కడ జరుగుతుంటాయి అనేది మందుబాబులకు కొట్టిన పిండిగా మారింది. 2011 నుంచి ఈ విధానం కొనసాగిస్తుండటమే దీనికి కారణం. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లు ఆయా సమయాలు, మార్గాలను వదిలి వెళుతూ చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లే కొన్నిసార్లు ప్రమాదాలకు లోనవుతూ, కారకులుగా మారుతున్నారు. 

తమ ప్రాణాలు కోల్పోవడమో, ఎదుటి వారి ప్రాణం తీయడమో చేస్తున్నారు. గత నెలలో పాఠశాల బస్సులపై ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించారు. అప్పట్లో బడి బస్సులు నడిపే 35 మంది డ్రైవర్లు సైతం మద్యం మత్తులో చిక్కారు. ఈ విషయాలు గమనించిన నగర ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానానికి నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆమోదముద్ర వేయడంతో బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేపట్టారు. మైనర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే కఠిన చర్యలు తీసుకోవాలని, వారితో పాటు వాహన యజమాని, మద్యం విక్రయించిన వ్యాపారి పైనా కేసులు నమోదు చేయనున్నారు. మైనర్‌ డ్రైవింగ్‌ పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా చిక్కిన 4500 మందిపై కేసులు నమోదు చేశారు. 2800 వాహనాల రిజి్రస్టేషన్‌ రద్దు కోసం సిఫార్సు చేయగా... ఆర్టీఏ అధికారులు ఇప్పటికే 863 రద్దు చేసినట్లు జోయల్‌ డెవిస్‌ ప్రకటించారు. మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ చిక్కితే వారికి 25 ఏళ్ల వచ్చే వరకు లైసెన్సు రాదని స్పష్టం చేశారు.  

మింట్‌ కాంపౌండ్‌లో స్పెషల్‌ డ్రంకన్‌ డ్రైవ్‌ 
ఖైరతాబాద్‌: నగర సీపీ ఆదేశాల మేరకు పగటి పూట కూడా డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం మింట్‌ కాంపౌండ్‌లో ఆకస్మికంగా డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా చేపడుతున్న స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా షాకింగ్‌ కలిగించే విషయాలు బయటపడ్డాయని, ముఖ్యంగా స్కూలు బస్సు, స్కూల్‌కు ఆటోలలో పిల్లల్ని తీసుకువెళ్లే డ్రైవర్లు తాగి డ్రైవ్‌ చేస్తున్నారని చెప్పారు. నెల రోజుల్లో 35 కేసులు నమోదు చేశామని, ఓ స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు 400 రీడింగ్‌ వచి్చందని తెలిపారు. నగరంలో ఆకస్మికంగా పగటి పూట కూడా డ్రంకన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. డీసీపీ శ్రీనివాస్, అడిషనల్‌ డీసీపీ రాములు, సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ మోహన్‌ కుమార్, సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి పాల్గొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)