Breaking News

తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

Published on Tue, 09/16/2025 - 19:41

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ మెడికల్‌ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు జరిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 809 మెడికల్ షాపులు,అనధికార వైద్యులకు సంబంధించిన ఆస్పత్రులలో డీసీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 234 మెడికల్ షాపుల్లో అబార్షన్‌ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ వంటి మందులు లైసెన్స్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లుగా పలు ఆధారాల్ని సేకరించారు.  

దీంతో సదరు మెడికల్‌ షాపులను సీజ్‌ చేస్తూ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరు 234 మెడికల్‌ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 165 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు ఏడు మెడికల్ షాపుల లైసెన్సులు పూర్తిగా రద్దు చేశారు.  

అక్రమంగా అబార్షన్‌ కిట్లు మహిళలకు ప్రమాదం. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు కొనసాగుతాయి అధికారులు తెలిపారు. అనధికార మెడికల్ షాపుల వద్ద అబార్షన్‌ కిట్లు, మందులు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి హానికరం. ప్రజలు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)