Breaking News

మండే ఎండ.. విపరీతంగా ఉక్కపోత

Published on Sat, 06/07/2025 - 05:55

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌ను జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పరిగణిస్తారు. కానీ ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలి నాలుగు రోజులు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. కానీ వాస్తవ సీజన్‌ ప్రారంభం(జూన్‌ 1వ తేదీ) నుంచి రుతుపవనాల కదలికలు కాస్త మందగించాయి.

దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా రోహిణి కార్తె చివర్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం పొద్దంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వర్షాలు మాత్రం కురవటంలేదు. ఈ నెల తొలి వారంరోజుల్లో 26 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. అందులో సగం కూడా కురవలేదు.

రెండోవారం తర్వాతే..: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా లేవు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. జూన్‌ రెండోవారం తర్వాతే వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతోనే నైరుతి సీజన్‌ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు.

ప్రస్తుతానికి వాతావరణ శాఖ సైతం ఎలాంటి అంచనాలను విడుదల చేయలేదు. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హనుమకొండలో 23ల డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)