Breaking News

Hyderabad: నిద్ర మాత్రలు వేసుకుని కారు డ్రైవింగ్‌

Published on Fri, 03/14/2025 - 07:44

సుభాష్‌ నగర్‌ : మొతాదుకు  మించి నిద్ర మాత్రలు వేసుకున్న  ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ  మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్‌ గురువారం రాత్రి అతివేగంగా కారు నడుపుతూ జగద్గిరిగుట్ట పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ రోడ్డులో ప్రయాణికులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆపకుండా అతను  షాపూర్‌నగర్‌ లోని డీసీపీ కార్యాలయం ఎదుట మరి కొందరిని ఢీకొట్టాడు. 

దీంతో స్థానికులు కారును వెంబడించి ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిని గుర్తించిన జీడిమెట్ల ట్రాఫిక్‌ ఎస్సై సందీప్‌ అతడిని వెంబడించి సూరారంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి మత్తులో ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉండటంతో అతడిని సూరారం పోలీసులకు అప్పగించారు. 

వివరాలు సేకరించిన పోలీసులు అతడిని గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్‌ గుర్తించి అతడి భార్య  డాక్టర్‌ సువర్ణకు  సమాచారం అందించారు. తన భర్త వ్యాపార పని  నిమిత్తం వివేకానంద నగర్‌కు వెళ్లాడని, అప్పుడప్పుడు మోతాదుకు మించి స్లీపింగ్‌ టాబ్లెట్లు  తీసుకోవడంతో తను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటాడని తెలిపింది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.  

 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)