Breaking News

ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ

Published on Sat, 06/28/2025 - 15:36

హైదరాబాద్‌: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 

2025 జూన్ 26న(గురువారం) శంకర్‌పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది.  అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్‌తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు.  తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే..  

ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్‌ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)