Breaking News

‘కృష్ణా’లో కేటాయింపులే జరగలేదు

Published on Fri, 08/25/2023 - 02:01

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఏపీకి 26.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలను విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్ప ష్టం చేసింది. ఈ నెల 21న త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆ రోజు త్రిసభ్య కమిటీ క న్వినర్, కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, ఏపీ జల వనరు ల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి మాత్రమే సమా వేశమై తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చించా రని తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులు జరగలేదని, అసలు తెలంగాణ అంగీకారం తెలపలేదని వివరణ ఇచ్చింది.  

కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శితో తెలంగాణ ఈఎన్‌సీ భేటీ  
కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం.రాయిపూరేను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ గురువారం జలసౌధలో కలిసి కృష్ణా జలాల కేటాయింపులపై పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఏపీ జల వనరుల శాఖ ఈఎన్‌సీతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి అవసరాలకుపై చర్చించిన అనంతరం, నీటి కేటాయింపులపై సిఫారసులతో రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలు(మినట్స్‌) అంతర్గతంగా సర్క్యులేట్‌ చేశామని, పత్రికలకు అధికారికంగా విడుదల చేయలేదని రాయిపూరే వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

త్వరలో త్రిస భ్య కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ సూచించారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల జలవినియోగం, నీటి నిల్వ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీటి అవసరాలను మదింపు చేసిన తర్వాత కేటాయింపులు జరపాలని కోరారు. తాగునీటి అవసరాలను త్రిసభ్య కమిటీలో చర్చించి, ఇరుపక్షాల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)