Breaking News

కేంద్రం వద్దకు ఆర్డినెన్స్‌ ముసాయిదా!

Published on Fri, 07/25/2025 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టం–2018ని సవరించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను.. న్యాయ సలహా కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు సైతం కేంద్రానికి వెళ్లగా..దీనిపై 30 నుంచి 32 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపించినట్లు కూడా తెలిసింది. 

కాగా ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్ర హోం శాఖకు పంపిన అంశంపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించడం లేదు. ప్రస్తుత పరిమితి 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రానికి హక్కు ఉన్నట్లుగా ముసాయిదాలో పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పీఆర్‌ చట్టానికి సవరణల వరకే ప్రతిపాదించారా? 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు జరుగుతుందా? ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది చర్చనీయాంశమౌతోంది.  

ఢిల్లీ స్థాయిలో చర్చ.. 
ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుదల వంటి వాటిపైఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలను గురించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు.. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు రాహుల్‌గాందీ, ప్రియాంక, కాంగ్రెస్‌ ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ఆర్డినెన్స్, పంచాయతీరాజ్‌ చట్టంలో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఉండాలనే క్లాజ్‌ సవరణ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాను గవర్నర్‌ కోరినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో చట్ట, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై ఆయన స్పష్టత కోరినట్టు తెలుస్తోంది.   

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు