Breaking News

ఇక్రిశాట్‌ నూతన డైరక్టర్‌ జనరల్‌గా డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు

Published on Thu, 03/06/2025 - 17:56

సాక్షి,హైదరాబాద్‌: అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. తాజాగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకునే క్రమంలో ఇక్రిశాట్ హిమాన్షు పాఠక్‌కు సాదర స్వాగతం పలికింది.

మొట్టప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన డాక్టర్‌ హిమాన్షూ పాఠక్‌ దేశంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ శాస్త్రవేత్త. నేల, వ్యవసాయ రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విసృ‍్తత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యనభ్యసించారు.

భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌)లో సాయిల్‌ సైన్స్‌ ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శిగా ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా, ఐసీఏఆర్‌ జాతీయ వరి పరిశోధన సంస్థ (కటక్‌) డైరెక్టర్‌ జనరల్‌గా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబయటిక్‌ స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ (బారామతి) డైరెక్టర్‌గానూ పనిచేశారు. 

యూకేలోని ఎస్సెక్స్‌ యూనివర్శిటీ, జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటరాలజీ అండ్‌ క్లైమెట్‌ రీసెర్చ్‌లలో విజిటింగ్‌ సైంటిస్ట్‌గా పని చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని మెట్టప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్‌ పాఠక్‌ది కీలకపాత్ర.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)