Breaking News

రూ.17.51 లక్షలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

Published on Mon, 04/21/2025 - 00:44

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్రాలు నిరుపేదలకు ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోంది. అయితే, వీటి నిర్మాణ వ్యయం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు మించదు. కానీ, దేశంలోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో పేదలకు ఏకంగా రూ.17.51 లక్షలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇంటితోపాటు సోఫా, రెండు బీరువాలు, ఓ టీవీని కూడా ఉచితంగా ఇస్తోందట. తెలంగాణ గృహనిర్మాణ శాఖకు చెందిన ఎస్‌ఈ స్థాయి అధికారులు చైతన్య, ఈశ్వరయ్య కేంద్రప్రభుత్వ స్టడీ టూర్‌లో భాగంగా ఇటీవల సిక్కిం వెళ్లి, ఆ పేదల ఇళ్లను పరిశీలించారు.  

సకల సదుపాయాలు 
పేదలకు ఉచిత ఇళ్లు అంటే ప్రభుత్వాలు ఏదో కొంత మొత్తం ఇచ్చి మమ అనిపించటం చూస్తుంటాం. కానీ, సిక్కిం ప్రభుత్వం మాత్రం సకల సౌకర్యాలతో పేదలకు ఉచిత ఇళ్లు అందిస్తోంది. సిక్కిం గరీబ్‌ ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా 678 చదరపు అడుగుల వైశాల్యంతో ఇల్లు నిర్మించి ఇస్తోంది. ఇందులో రెండు పడకగదులు, వంటశాల, లివింగ్‌ రూమ్, టాయిలెట్‌ ఉంటాయి. ఇదంతా మామూలే. కానీ, లబ్ధిదారుల కోసం ఒక సోఫా, రెండు స్టీల్‌ బీరువాలు, ఓ టీవీ సెట్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుండటం విశేషం. ఈ సకల సౌకర్యాల ఇంటికి అక్షరాలా రూ.17.51 లక్షలు ఖర్చవుతోందట. ఇలాంటివి పది వేల ఇళ్లు నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

అవాక్కైన అధికారులు 
ఈ పథకం తీరు చూసి స్టడీ టూర్‌కు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. ఒక చిన్న రాష్ట్రం ఇంత భారీ వ్యయంతో పథకాన్ని అమలు చేస్తున్న తీరును ఆసక్తితో పరిశీలించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మిజోరం, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్, అస్సాం అధికారులతోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, హడ్కో ప్రతినిధులు కూడా ఈ టూర్‌ లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయంతోపాటు రాష్ట్రప్రభుత్వ సొంత నిధులతో ఈ పథకం అమలవుతోంది.

కొండ ప్రాంతం కావటంతో ఈ ఇళ్ల నిర్మాణంలో సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మిస్తున్నట్టు చైతన్య తెలిపారు. అక్కడ రూ.1.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మరో ఇళ్ల పథకం కూడా ఉందని చెప్పారు. పేదల్లో అతి పేదలు, వార్షిక ఆదాయం రూ.లక్ష మించని వారికి ఖరీదైన ఇళ్ల పథకాన్ని వర్తింపచేస్తున్నారని వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)