Breaking News

ఇవి మా ఇళ్లు.. వదిలి వెళ్లం

Published on Mon, 06/30/2025 - 09:08

మంచాల(రంగారెడ్డి): డబుల్‌ బెడ్రూం ఇళ్లను అందజేయటంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ.. లబ్ధిదారులు ఆ ఇళ్లను నేరుగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాటలపై నమ్మకం సన్నగిల్లిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మంచాల, నోముల, లింగంపల్లి గ్రామస్తుల కోసం లింగంపల్లి గేట్‌ వద్ద డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఏడాదిన్నర క్రితం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లను మాత్రం అప్పగించలేదు.

 అప్పటి నుంచి లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న ఇళ్లు కేటాయిస్తామని అధికారులు తెలపటంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రొసీడింగ్స్‌ ఇవ్వలేదు. ఈ నెల 28న ఇస్తామని మరోసారి చెప్పారు. ఆ గడువు కూడా దాటిపోవడంతో విసిగిపోయిన లబ్ధిదారులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసుకొని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ అక్కడికి చేరుకొని లబ్ధిదారులతో మాట్లాడారు.

 ప్రభుత్వం అధికారికంగా ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన తర్వాతే రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా లబ్ధిదారులు ససేమిరా ఒప్పుకోలేదు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇళ్లు కూడా కేటాయించలేదని, ప్రస్తుతం తాము ఉన్న ఇళ్లు వర్షాలకు కురుస్తున్నాయని, ఎక్కడ తలదాచుకోవాలని నిలదీశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఇళ్లను వదిలి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)