Breaking News

Hyderabad: కిడ్నీలో 418 రాళ్లు!

Published on Thu, 03/14/2024 - 06:40

లక్డీకాపూల్‌: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్‌యూ  వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్‌ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల  మహేష్‌ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్‌ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్‌ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్‌ గోపాల్‌ ఆర్‌.టక్, డాక్టర్‌ దినేష్‌ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్‌ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్‌) పద్ధతిని ఎంచుకున్నారు.

ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్‌ ప్రోబ్‌లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం  దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.

మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్‌ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్‌యూ వైద్య నిపుణులు సూచించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)