Breaking News

దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు

Published on Thu, 10/30/2025 - 17:31

సాక్షి, మహబూబాబాద్‌: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా  ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో  వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.

మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)