Breaking News

డాక్టర్‌ బూట్లు ఎత్తుకెళ్లాడు..

Published on Fri, 02/28/2025 - 09:10

సాక్షి, హైద‌రాబాద్‌ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. వైద్యుడి గదిలోకి వచ్చిన  ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న బూట్లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజీగూడ, యశోద ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు డాక్టర్లు వినియోగించే బీ1 సెల్లార్‌ నుంచి లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడి గదిలో డాక్టర్‌కు చెందిన డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి రూ.15 వేల విలువ చేసే షూస్‌ను తస్కరించాడు. 

ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్‌ కృష్ణ ఫిర్యాదు మేరకు పంజగుట్ట (Panjagutta) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి బీ1 సెల్లార్‌ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లి డాక్టర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో షూస్‌ తొడుక్కుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి  బయటికి వచ్చిన అతను రాజ్‌భవన్‌ వైపు నడిచి వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

చిల్లర దొంగ పనే 
సూర్యాపేటకు చెందిన మహేష్‌ (22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన అతను సోమాజీగూడలోని దక్కన్‌ ఆస్పత్రిలో పని చేస్తూ ఇక్కడే హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న యశోద ఆస్పత్రి సిబ్బందితో పరిచయాలు పెంచుకుని  తరచూ వచ్చి పోతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రి ఐదో అంతస్తుకు వెళ్లి వైద్యుడి డ్రెస్సింగ్‌ రూమ్‌లో షూస్‌ దొంగిలించి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి గదిలో సోదాలు చేయగా ఒక ఐ–ఫోన్, ట్యాబ్‌తో పాటు షూస్‌ స్వాధీనం చేసుకున్నారు. 

చ‌ద‌వండి: రియల్‌ టైమ్‌లో పట్టేస్తున్నారు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)