Breaking News

నీట్‌ రద్దు: మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ

Published on Wed, 10/13/2021 - 12:20

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌తో డీఎంకే ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు టీకేఎస్‌ ఎలాన్గోవన్‌, రామస్వామితో కలిసి కేటీఆర్‌కు అందజేశారు.

అనంతరం డీఎంకే ఎంపీ ఎలెన్గోవన్‌ మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌ను కలిశాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్‌ పరీక్ష అంశంపై మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర విధానంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగాము. అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కీలకమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదు అని ఎంపీ ఎలాన్గోవన్‌ అన్నారు. 

ఇదే అంశంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్‌ రద్దు అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. అందుకు మద్దతు కోసం డీఎంకే ఎంపీలు కేటీఆర్‌ను కలిశారు. లెటర్‌ తీసుకొచ్చి కేటీఆర్‌కి స్వయంగా అందించి మద్దతు అడిగారు అని ఎంపీ రంజిత్‌ రెడ్డి తెలిపారు. 

చదవండి: (పెట్టుబడులకు నిలయం.. తెలంగాణ) 

Videos

వంశీని వదలరా? ఎందుకంత కక్ష..!

జగన్ ను ఢీ కొట్టలేక బాబు చిల్లర కుట్రలు

హద్దు మీరుతున్న రెడ్ బుక్.. కోర్టులు తిడుతున్నా సిగ్గు లేదా..

ఆడబిడ్డనిధి'కి సమాధి.. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు

తిరుమలలో గౌతమ్ గంభీర్

మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్

PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

Photos

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)