Breaking News

అసెంబ్లీకి డీకే అరుణ.. ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ విజ్ఞప్తి

Published on Tue, 09/05/2023 - 16:50

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత డీకే అరుణ మంగళవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. 

కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేగా డీకే అరుణను డిక్లేర్‌ చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్‌ ఇవ్వాలని  కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, సీఎస్‌ అసెంబ్లీ కార్యదర్శలకు ఉత్తర్వులు పంపింది.

ఇక 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా డీకే అరుణ, తెరాస నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా.. కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. అయితే నామినేషన్‌ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఉటంకించింది.
చదవండి: విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)