Breaking News

జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి!

Published on Thu, 04/04/2024 - 07:42

సాక్షి, హైదరాబాద్‌: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్‌–4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నా యి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా... వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు  సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్‌ భావిస్తోంది. ఇక జోనల్, మలీ్టజోనల్‌ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్‌ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆమేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది. 

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం 
టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్‌లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌(జీఆర్‌ఎల్‌)లను కూడా కమిషన్‌ విడుదల చేసింది. జీఆర్‌ఎల్‌కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్‌పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి, మలీ్టజోనల్‌ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. 

నోటిఫికేషన్‌లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకేంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు.   

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం: టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్‌లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌(జీఆర్‌ఎల్‌)లను కూడా కమిషన్‌ విడుదల చేసింది. జీఆర్‌ఎల్‌కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్‌పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి, మలీ్టజోనల్‌ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. 

నోటిఫికేషన్‌లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు.    

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)