Breaking News

‘సాక్షి’లో చూసి సాయమందించాం

Published on Thu, 09/12/2024 - 04:25

ఖమ్మం మయూరిసెంటర్‌: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్‌ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం వన్నెల్‌ (కె) గ్రామ యువకులను కది లించింది. 

దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్‌ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్‌ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్‌ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. 

వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... 
ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని 55వ డివిజన్‌కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్‌ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్‌ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్‌ రూ.5 వేలు అందజేశారు.   తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు.  

సాక్షిలో చూసి చలించిపోయాను
రాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా  కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం.  
– అర్గుల శ్రీకాంత్‌ 

Videos

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)