Breaking News

త్వరలో గణపతి సైతం..

Published on Sat, 02/28/2026 - 05:42

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి లొంగుబాటుపై చర్చ తీవ్రమవుతోంది. ఓవైపు కేంద్ర హోంశాఖ విధించిన గడువు దగ్గర పడుతుండటం..మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాట పట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి గణపతి పైకి మళ్లుతోంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో మిగిలిన ముగ్గురిలో గణపతి ఒకరు కావడంతో.. మావోయిజం అంతం లక్ష్యంలో ఇది కీలకంగా మారింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మావోయిస్టు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మావోయిస్టు పార్టీ సుప్రీంగా, ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన గణపతి గౌరవప్రదంగా లొంగిపోయేలా అవకాశం ఇవ్వాలని, ఆయన వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల లొంగిపోయిన తాజా, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇతర రాజకీయ అంశాలతో పాటు సీఎంతో భేటీలో ఈ అంశాన్ని సైతం దేవ్‌జీ, చంద్రన్న, మల్ల రాజిరెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తెచి్చనట్టు సమాచారం. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన, తెలంగాణ స్థానికుడైన గణపతి తెలంగాణలో లొంగిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సైతం మంచి పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  

నిర్బంధం పెరగడంతో లొంగు‘బాట’ 
మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించినప్పటి నుంచి మావోయిస్టు కీలక నేతలు ఉండేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. నిర్బంధం పెరగడంతో పలువురు నేతలు సహా మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు (సరెండర్‌) పాలసీ పక్కాగా అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లొంగిపోయేందుకు మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. తాజాగా ఉద్యమ ప్రస్థానానికి తెలంగాణలోనే ముగింపు పలకాలని గణపతి సైతం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

ఎక్కడ ఉన్నారనే చర్చ
వృద్ధాప్యం, అనారోగ్యంతో 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావుకు అప్పగించిన గణపతి, అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితం అయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లతో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టులపై పూర్తి స్థాయిలో పట్టుసాధిస్తుండడంతో ముందుగానే అప్రమత్తమైన మావోయిస్టు అగ్రనాయత్వం గణపతిని సేఫ్‌ జోన్‌లోకి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్పటివరకు మావోయిస్టు పారీ్టకి మార్గనిర్దేశనం చేస్తూ వచి్చన గణపతి బయటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రనాయత్వంతో సైతం టచ్‌లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేపాల్‌లో తలదాచుకున్నారని...లేదు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంచొచ్చని ఇలా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కానీ గణపతి ఎక్కడ అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.  

నమ్మకాన్ని పెంచుతున్న తెలంగాణ పాలసీ 
ఇటీవల లొంగిపోయిన కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ , మల్ల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, పోతుల కల్పన అలియాస్‌ సుజాత, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ తదితరుల లొంగుబాటు విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ఇచి్చన మాటను నిలుపుకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్ల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుండటం మావోయిస్టు నేతల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ కారణంగానే తెలంగాణ స్థానికుడు జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన గణపతి సైతం ఇక్కడే లొంగిపోతే మంచిదనే అభిప్రాయం మాజీ మావోయిస్టుల్లోనూ వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.

దేవ్‌జీ సహా ఇతరుల లొంగుబాటు సందర్భంగా గణపతి జాడపై మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ శివధర్‌రెడ్డి బదులిస్తూ.. గణపతి అడవుల్లో లేరని, మైదాన ప్రాంతంలో షెల్టర్‌ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉందని చెప్పిన నేపథ్యంలో గణపతి ఆచూకీపై పోలీసులకు కొంత స్పష్టత ఉందనే విషయం అర్థమవుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశంలోనూ గణపతి ప్రస్తావన వచి్చనట్టు తెలుస్తుండటంతో ఆయన కూడా త్వరలో తెలంగాణలోనే లొంగిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో లొంగిపోయిన మావోయిస్టులు చంద్రన్న, సుజాతక్కలు సైతం శుక్రవారం నాటి సమావేశంలో పాల్గొనడం గమనార్హం.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)