Breaking News

నా కొడుకును సంపేయండి

Published on Tue, 04/29/2025 - 07:29

నా కొడుకు పుట్టుక నుంచేనడువలేడు..కింద కూసోలేడు. 30 ఏళ్ల వయసు వచ్చినా సంటి పిల్లగాడి లెక్క సేవలు చేయాలె. వచ్చే పింఛన్‌ డైపర్లకు కూడా సరిపోతలేదు. కూలికి పోతేనే కుటుంబం గడిచేది. కిరాయిఇంటికి జీరో కరెంటు బిల్లు వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లుమంజూరు కాలేదు. ఏ ఆసరా లేదు. కొడుకు గోస సూడలేక పోతన్న. సాదుడు కష్టమైతంది. ఆదుకోండి.. లేదంటే కొడుకును సంపుండి..

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు కురుమవాడకు చెందిన పర్శ మల్లయ్య–లక్ష్మి దంపతులకు కుమారుడు సాయి, కూతురు ఉన్నారు. కొడుకు వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడి పోయి కనీసం కూర్చోలేని పరిస్థితి. తండ్రి ఎంసీహెచ్‌లో వాటర్‌మెన్‌గా.. తల్లి సాయిబాబా ఆలయంలో కూలి చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరూ పనికి వెళితేనే కుటుంబం గడిచేది. 

ఇద్దరూ పనులకు పోతే కొడుకుని ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే. ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్‌ రూ.4వేలు డైపర్లకు సైతం సరిపోవడం లేదు. మందులు, నెలవారి వైద్య ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. సర్కారు ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కాలేదు. 

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మల్లయ్య తన కొడుకును భుజాన ఎత్తుకొని వచ్చారు. ‘మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా.. మంజూరు చేయకుంటే నా కొడుకును సంపేయండి’అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ ఎదుట బోరున విలపించింది. స్పందించిన అదనపు కలెక్టర్‌ సంబంధిత అ«ధికారులను పిలిచి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)