Breaking News

హైదరాబాద్‌ టు హాంకాంగ్‌

Published on Wed, 02/26/2025 - 04:28

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి హాంకాంగ్‌కు నేరుగా విమాన సర్వీసులు వచ్చే మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హాంకాంగ్‌కు వెళ్లాలంటే.. హైదరాబాద్‌ నుంచి సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్‌ల మీదుగా రాకపోకలు సాగించేవారు. హైదరాబాద్‌ నుంచి ఏటేటా అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. 

రానున్న 18 నెలల్లో దశలవారీగా మరిన్ని అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌తోపాటు అడిస్‌ అబాబా, ఆమ్‌స్టర్‌డామ్, రియాద్‌లకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. 

ఈ ఏడాది జూన్‌లో ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ అడిస్‌ అబాబాకు విమానాలు నడపనుంది. సెప్టెంబర్‌లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రియాద్‌కు కూడా త్వరలోనే సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి మరిన్ని నగరాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌ నుంచి పారిస్, ఆస్ట్రేలియా, హోచిమిన్‌ సిటీ, హనోయ్, క్రాబీ, కఠ్మాండు, మదీనా నగరాలకు కొత్తగా విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఎయిర్‌పోర్ట్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణికర్‌ స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019–20 సంవత్సరంలో 32 లక్షల మంది విదేశాలకు రాకపోకలు సాగించగా, 2023–24 నాటికి ఈ సంఖ్య 42 లక్షలకు పెరిగింది.   

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌