Breaking News

అక్కడో రీతి.. ఇక్కడో తీరు

Published on Sun, 01/28/2024 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ భావి­స్తున్నా­యి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివ­ర్శిటీ­లతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్‌వేర్‌లు.. అక్కడ సివిల్స్‌ టార్గెట్‌ వయా డిగ్రీలు
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర­పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థు­లు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటెక్‌), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.

సగానికి పైగా ఇంజనీరింగ్‌ సీట్లు దక్షిణాదికే
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్‌ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్‌ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్‌ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది.

స్కిల్‌.. పాలన నైపుణ్యంపై దృష్టి
అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాప­రమై­న మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వా­మ్యం­తో ఇంజనీరింగ్‌ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్‌ చేయాలని భావి­స్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«­దా­నాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)