Breaking News

అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు

Published on Sat, 08/17/2024 - 11:14

సిద్దిపేట కమాన్‌: అప్పు చెల్లించడం లేదని అన్నా, వదినలను.. ఓ ప్రబుద్ధుడు తన భార్య, కొడుకుతో కలిసి గ్రిల్స్‌కు కట్టేశాడు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. దొంతరబోయిన పర్శరాములు, తార దంపతులు ఏడో తరగతి చదివే తమ కుమార్తెతో సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు.

 పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నాసర్‌పూరలో నివసిస్తున్న సొంత తమ్ముడు దొంతరబోయిన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం కౌన్సిలర్‌ కనకరాజు.. పర్శరాములుకు ఫోన్‌ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్‌పూరకు వచ్చారు. 

అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరిని బయటకు పంపించారు. బకాయి ఉన్న రూ.20వేలు, వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వీరి కుమారుడు భాను కలసి.. పర్శరాములు, అతని భార్య తారను కొట్టి నాసర్‌పూర హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాడుతో కట్టేశారు. స్థానికులు కలి్పంచుకుని వారిని విడిపించడంతో బాధితులు సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)