Breaking News

Hyderabad: మధ్యాహ్నం ఎండలు..  సాయంత్రం ఈదురు గాలులు

Published on Mon, 04/21/2025 - 08:45

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో గత మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా..  ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో పూర్తిగా చల్లబడుతోంది. ఇక వర్షం ప్రారంభమైతే అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్‌ వైర్ల తెగిపడుతున్నాయి. రోజువారీగా సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 39 డిగ్రీల వరకు, కనిష్టంగా 26.5 నుంచి 20.8 డిగ్రీల వరకు  నమోదవుతున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ మేర వీస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  

మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. 
నగరంలో ఉదయం 7 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. మరో వారం రోజుల్లో  గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌  వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఆదివారం ఈశాన్య  మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో వరుసగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)