Breaking News

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో యువతికి విభిన్నమైన బెయిల్‌ 

Published on Thu, 01/02/2025 - 07:17

బంజారాహిల్స్‌: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఓ యువకుడితో పాటు ఆయన స్నేహితురాలికి న్యాయమూర్తి విభిన్నమైన షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వెస్ట్‌మారేడుపల్లి సుమన్‌ హౌసింగ్‌ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్‌ (27), ఆయన స్నేహితురాలు గత నెల 27న ఫిలింనగర్‌ సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. అర్ధరాత్రి 2.30 గంటలకు దయాసాయిరాజ్‌ తన బెంజ్‌ కారు (టీఎస్‌ 10ఎఫ్‌ఎఫ్‌ 9666)లో స్నేహితురాలిని పక్కన కూర్చోబెట్టుకుని మితిమీరిన వేగంతో వస్తున్నాడు. 

ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ రోడ్డునంబర్‌–45 వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డివైడర్‌తో పాటు విద్యుత్‌ స్తంభం ధ్వంసమయ్యాయి. కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరినీ గత నెల 28న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ప్రతిరోజూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిసెప్షన్‌లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఫిర్యాదుదారులకు, బాధితులకు నవ్వుతూ స్వాగతం పలకాలని తీర్పునిచ్చారు. 

రిసెప్షన్‌లో కూర్చొనే రెండు గంటల పాటు ముఖానికి మాస్క్‌ కూడా ధరించవద్దని షరతు విధించారు. బెయిల్‌ మంజూరైన నాటి నుంచి 15 రోజుల పాటు రోజూ ఠాణాకు రావాలని, రిసెప్షన్‌లో కూర్చోవాలని, ఆ తర్వాత పోలీసుల సమక్షంలో హాజరైనట్లుగా సంతకం చేయాలని తీర్పునిచ్చారు.  దీంతో దయాసాయిరాజ్‌తో పాటు ఆయన స్నేహితురాలు రోజూ ఠాణాకు వచ్చి రిసెప్షన్‌లో కూర్చుంటున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)