Breaking News

కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి నిర్వహణ

Published on Fri, 03/15/2024 - 02:53

శామీర్‌పేట్‌: కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి పోర్టల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ ధరణి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా గురువారం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బొమ్మరాశిపేట గ్రామంలో ధరణి కమిటీ సభ్యులు పర్యటించారు.

అనంతరం బొమ్మరాశిపేట రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కోదండరెడ్డి, ధరణి కమిటీ న్యాయ సలహాదారు సునీల్‌లు మాట్లాడుతూ.. బొమ్మరాశిపేట గ్రామంలో ధరణిలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, బడా బాబులు కుమ్మక్కై భూ సమస్యలను సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు.

ధరణిలో ఉన్న లోపాలను గుర్తించేందుకు బొమ్మరాశిపేట గ్రామంలో నెలకొన్న భూ సమస్యను ఓ కేస్‌ స్టడీగా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో మార్పులు చేపట్టి, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తామని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, త్వరలోనే ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భరోసా ఇచ్చారు. 

లొసుగులను వాడుకొని..
ధరణిలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు బడాబాబులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొమ్మరాశిపేట రైతులు ధరణి కమిటీ సభ్యుల ముందు వాపోయారు. 50 ఏళ్ల క్రితం 1,050 ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగుచేస్తున్నామని, ఇటీవల కొందరు వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదంటూ.. అధికారులతో కుమ్మక్కై భూములను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్పించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

తమ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని, కొంత స్థలం అమ్మి కూతుళ్ల పెళ్లిచేయాలని ప్రయత్నించినా ధరణి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు