Breaking News

TG: ఫౌండేషన్‌ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్‌ ఇస్తామని 540 కోట్లు..

Published on Mon, 07/08/2024 - 17:57

సాక్షి, హైదరాబాద్: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్‌ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్‌ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.

ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్‌ శర్మను అరెస్ట్‌ చేసి ధన్వంతరి ఫౌండేషన్‌ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్‌ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్‌ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు