Breaking News

అప్పుడు సర్పంచ్‌.. ఇప్పుడు లెక్చరర్‌

Published on Fri, 11/28/2025 - 09:47

నల్గొండ జిల్లా: నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమనబోయిన ధనలక్ష్మి 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు.  సర్పంచ్‌గా కొనసాగుతూనే 2009–2010లో బీఈడీ, 2010– 2012లో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం నకిరేకల్‌ మండలం చందుపట్ల గురుకుల జూనియర్‌ కళాశాలలో తెలుగు «అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. ధనలక్ష్మి సర్పంచ్‌ గా ఉన్న సమయంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ పంచాయతీ 2007–2008 నిర్మల్‌ పురస్కారానికి ఎంపికైంది.  

 ఓటు వేయాలంటే దూరం నడవాల్సిందే
గట్టుప్పల్‌ : గట్టుప్పల్‌ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గిరిజన తండాలకు చెందిన ఓటర్లకు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరభారం తప్పడం లేదు. అంతంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్‌కు రంగంతండా సుమారు 1.5 కిలోమీటర్లు, అజనాతండా 3 కిలోమీటర్లకు పైగా, దేవులతండా 0.5 కిలోమీటర్లు, రాగ్యాతండా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650మంది ఓటర్లు ఉన్నారు. ఆయా తండాల ప్రజలు ఏళ్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతంపేటకు వస్తున్నారు. దీంతో వృద్ధులు, అంగవైకల్యం కల్గిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా అంతంపేట ప్రాథమిక పాఠశాలలోనే పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసినట్లు మండల పంచాయతీ అధికారి సునీత తెలిపారు.  

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)