ఆ ఇద్దరి ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్‌

Published on Mon, 10/27/2025 - 03:31

లక్డీకాపూల్‌/పంజగుట్ట: చాదర్‌ఘాట్‌ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య, గన్‌మెన్‌ మూర్తి ధైర్య సాహసాలను ప్రదర్శించారని డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిని ఆదివారం డీజీపీ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివధర్‌రెడ్డి మాట్లాడుతూ చైతన్య, మూర్తిల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇద్దరూ సోమవారం డిశ్చార్జ్‌ అయ్యే అవకాశముందన్నారు. నిందితుడు అన్సారీకి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.  

కొన్ని క్లూస్‌ లభించాయి: సీపీ సజ్జనార్‌  
చాదర్‌ఘాట్‌ ఘటనలో కొన్ని క్లూస్‌ లభించాయని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆటోడ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకునేందుకు సౌత్‌జోన్‌ డీసీపీ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఇటీవల ఒమర్‌ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. విజబుల్‌ పోలీసింగ్‌ కూడా పెంచామని పేర్కొంటూ..ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. డీసీపీ చైతన్యకి మెడ భాగంలో, గన్‌మెన్‌ మూర్తికి కాలుకు గాయమైందని చెప్పారు. డ్రైవర్‌ సందీప్‌ అలర్ట్‌గా ఉండి కీలక పాత్ర పోషించారన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)