Breaking News

ఎవరి పాత్ర ఉన్నా విచారిస్తాం

Published on Wed, 12/31/2025 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందా..? లేదా..? అన్నది ఇప్పుడే చెప్పలేమని, అది కేసు దర్యాప్తులో భాగంగా తెలుస్తుందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి తెలిపారు. కేసులో ఎవరి పాత్ర ఉన్నా.. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి స్పందించడం సరికాదన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్, ఈగల్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, అడిషనల్‌ డీజీలు మహేశ్‌ భగవత్, అనిల్‌ కుమార్, చారు సిన్హా, సంజయ్‌ కుమార్‌ జైన్, ఐజీలు డా.ఎం.రమేశ్, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తెలంగాణ పోలీస్‌ వార్షిక నివేదిక 2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అన్ని రకాల నేరాల్లో 2 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించారు. 3 విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్‌ సమ్మిట్, మెస్సీ ఈవెంట్, మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణతో సహా అన్నింటినీ విజయవంతంగా నిర్వహించామన్నారు. 

మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి 
కేంద్ర ప్రభుత్వ డెడ్‌లైన్‌ ప్రకారం మార్చి 31 వరకు మావోయిస్టుల సమస్య పరిష్కారానికి తెలంగాణ పోలీసులు సైతం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నందున తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాట్లు పెరిగాయన్నారు. పోలీస్‌ శాఖలో సిబ్బంది కొరతపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవసరాలకు తగిన విధంగా సిబ్బంది నియామకాలపై ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్టు తెలిపారు. నయాం కేసు దర్యాప్తులో భాగంగా స్వాదీనం చేసుకున్న భూములు విక్రయించకుండా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. 

రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అందులో వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయన్నారు. పోలీస్‌ సిబ్బంది ఆత్మహత్యలకు కారణమవుతున్న పరిస్థితులను తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం కొనసాగుతుందని తెలిపారు. మహిళా, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా ‘ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చుతుంది’అన్న థీమ్‌తో త్వరలోనే మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిమిషం నిడివితో షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్, పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహించనున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)