Breaking News

మావోయిస్టుల చొరబాట్లు లేవు: డీజీపీ జితేందర్‌

Published on Fri, 01/17/2025 - 18:49

సాక్షి,మహబూబ్‌నగర్‌:ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో  సరిహద్దులో గస్తీ పెంచామని, రాష్ట్రంలోకి మానోయిస్టుల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం లేదని డీజీపీ జితేందర్‌ తెలిపారు. శుక్రవారం(జనవరి17) మహబూబ్‌నగర్‌ ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్ష జరిపిన అనంతరం డీజీపీ  మీడియాతో మాట్లాడారు.

‘అన్ని రకాల క్రైంపై సమీక్ష చేశాం. ప్రమాదాలు,నేరాల తగ్గుదల కోసం సూచనలు చేశాం. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కర్ణాటక,ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కలిసి నేరస్తుల కోసం పనిచేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

కొత్త స్టేషన్‌ల ఏర్పాటే కాకుండా  పాతవాటిని కూడా అప్ గ్రేడ్ చేయాలను కుంటున్నాం,రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్‌ డబ్బుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. కాగా, గడిచిన కొన్ని నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో వరుస  ఎన్‌కౌంటర్లు కలకలం రేపాయి. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ పలువురు పోలీసులు కూడా మృత్యువాత పడ్డారు. 

పోలీసులపై మావోయిస్టుల ప్రతీకార దాడులు కూడా పెరగడంతో వారి ప్రాబల్యం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణలోనూ మావోయిస్టులు మళ్లీ బలపడొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డీజిపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్‌ టు ట్యాంక్‌బండ్‌ అలర్ట్‌.. బీదర్‌ ముఠా ఎక్కడ

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)