Breaking News

దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Published on Wed, 08/16/2023 - 16:19

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని  2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి  అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది.

ఈ ఏడాదికిగానూ పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈనెల 25వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా,జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)