Breaking News

సీఎం రేవంత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి

Published on Mon, 07/08/2024 - 04:34

లంగర్‌హౌస్‌ (హైదరాబాద్‌): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అయితే సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తారని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అన్నారు. రాష్ట్రంలో మెదటి బోనాల పూజలు అందుకునే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. 

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారమ్యన్, గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ కాంత అరవింద్‌ల ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్‌ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నజర్‌బోనంతో, తొట్టెలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు. 

ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

20 కోట్లు మంజూరు..
అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు గత సంవత్సరం కంటే రూ.5 కోట్లు ఎక్కు వగా అంటే ఈ సంవత్సరం రూ.20 కోట్లు మంజూరు చేశా మని తెలిపారు. ఒక వేళ ఈ నిధులు సరిపోకపోతే మరింత అందజేస్తామని వివరించారు. గోల్కొండ బోనాలు నిర్వ హించే కార్వాన్‌ నియోజకవర్గానికి 73 లక్షల 15 వేల రూపా యలు మంజూరు చేశామన్నారు. 

అనంతరం ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. జంట నగరాల బోనా ల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దానం నాగేందర్, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంత రావు, సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)