Breaking News

ఎనర్జీ స్టోరేజ్‌లో మనం మైనస్‌: డిప్యూటీ సీఎం భట్టి

Published on Sat, 11/29/2025 - 13:14

హైదరాబాద్‌: ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా, విద్యుత్‌ అత్యంత ప్రధానమని, అందుకే రాష్ట్రానికి వచ్చే పదేళ్ల విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ డిమాండ్, భవిషత్తు ప్లణాళికలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణలో 9 శాతం గ్రోత్ ఉండనున్నదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే వచ్చే పదేళ్ళ లో 20శాతం మైనస్‌లో ఉంటామన్నారు. అందుకే విద్యుత్ సమస్యలను తగ్గించడానికి గ్రీన్ ఎనర్జి ఉత్పత్తి చేయాలని భట్టి పేర్కొన్నారు. ప్రపంచం అంతటా విద్యుత్ కష్టాలు ఉన్నాయని, అందుకే గ్లోబల్ అంతా గ్రీన్ ఎనర్జి వైపు వెళ్తోందన్నారు. ప్రస్తుతం సోలార్‌లో మైనస్ 780 మెగావాట్స్ లో ఉన్నామన్నారు. ఎనర్జీ స్టోరేజ్‌లో మైనస్ 4వేల మెగావాట్స్ లో ఉన్నామని, ఎనర్జీ స్టోరేజ్‌పై గతంలో ఎక్కడా ప్లానింగ్ లేదన్నారు. థర్మల్, విండ్ విషయంలో 2028 వరకు తెలంగాణ రాష్ట్రం పరవాలేదన్నారు. ఎనర్జీ స్టోరేజ్ విషయంలో ప్లాన్ చెయ్యకపోతే మనం మైనస్ 8500 మెగావాట్స్ లో ఉంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

గ్రిడ్ కెపాసిటీ అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని,  గ్రిడ్ ఫెయిల్యూర్ అయితే రాష్ట్రంలో చీకటి తప్పదని భట్టి పేర్కొన్నారు. గ్రిడ్ ఫెయిల్యూర్ అయితే పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టరని అన్నారు. సోలార్ పవర్ అనేది వాతావరణం పై ఆధారపడుతుందని, థర్మల్ పవర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యమన్నారు. కొందరు తెలియని వాళ్ళు సోలార్ ఉండగా, థర్మల్ ఎందుకు  అని అంటారని భట్టి పేర్కొన్నారు. విద్యుత్‌ విషయంలో ఇప్పుడే ప్రణాళికలు మొదలు పెట్టకపోతే, వచ్చే పదేళ్లలో పది వేల మెగావాట్స్ థర్మల్ అందుబాటులోకి రాదన్నారు. విద్యుత్‌ విషయంలో  రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సంకుచిత మనస్తత్వంతో ఆలోచించదన్నారు.

ఇది కూడా చదవండి: Hyd: టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)