Breaking News

పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌

Published on Sat, 11/22/2025 - 03:52

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో భట్టి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డెలాయిట్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్‌ఎల్‌ సహా పలు సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలతోపాటు నైపుణ్యంతో కూడిన తక్కువ ధరలకే మానవ వనరులు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశాలు అన్నారు.

దేశంలో ఈ విధమైన రాష్ట్రం మరెక్కడా లేదని పెట్టుబడిదారులకు వివరించారు. ఓఆర్‌ఆర్, దీనికి తోడుగా కొత్తగా ట్రిపుల్‌ ఆర్‌ వల్ల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ట్రిపుల్‌ ఆర్‌తో రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలు అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్‌ వరకు 39 రేడియల్‌ రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ 39 రేడియల్‌ రోడ్ల మధ్య ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు.  

24 గంటల నాణ్యమైన విద్యుత్‌  
రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తోందని భట్టి చెప్పారు. భవిష్యత్‌లో విద్యుత్‌ కొరత లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.  సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని భట్టి చెప్పారు. రూ.89 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామని, ఇప్పటికే రూ.60,799 వేల కోట్ల విలువైన పనులకు అన్నిరకాల అనుమతుల లభించాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా,  నవీన్‌మిత్తల్,  జయేశ్‌రంజన్, కృష్ణ భాస్కర్,  ఎన్‌.బలరామ్,   సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)