Breaking News

ఆ దిశగానే భారత్‌ సమ్మిట్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Published on Thu, 04/24/2025 - 19:20

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్  స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని,  ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.

ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం.  వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.

ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర  సంఘటన.  ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న  వనరుల వివరిస్తాం. 

న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్‌ ఫౌండేషన్‌ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసీసీ)లో భారత్‌ సమ్మిట్‌ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)