Breaking News

స్టార్టప్‌ కేంద్రంగా తెలంగాణ

Published on Sat, 11/22/2025 - 04:01

సాక్షి, హైదరాబాద్‌: సరికొత్త ఆవిష్కరణలతో తెలంగాణ తన సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని, స్టార్టప్‌ కేంద్రంగా ప్రపంచ పటంలో నిలబడాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని, తెలంగాణ రైజింగ్‌–2047 డాక్యుమెంట్‌లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ డైమండ్‌ జూబ్లీ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతఉద్యోగాలు వెతుక్కునే వారుగా కాకుండా, వాటిని సృష్టించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యకు వెచి్చంచే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా, భవిష్యత్‌పై పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు.  

జేఎన్‌టీయూ ప్రతిష్టను పెంచుతాం 
పండిట్‌ జవహర్‌లాల్‌ పేరు మీదున్న జేఎన్‌టీయూహెచ్‌ దేశ పురోగతికి ఇంజన్‌ కావాలని భట్టి కోరారు. కాలేజీగా మొదలై, యూనివర్సిటీ స్థాయికి ఎదగడమే కాకుండా, దేశానికి ఎంతోమంది గొప్ప వ్యక్తులను అందించిందన్నారు. నిజాయితీతో ప్రవేశ పరీక్షలు, అనుబంధ కాలేజీలకు నైతిక మార్గనిర్దేశం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తోందన్నారు. 

యూనివర్సిటీ ప్రతిష్టను మరింత పెంచుతామని భరోసా ఇచ్చారు. వర్సిటీ భూమి లీజు సమస్య, లీజ్‌ అద్దె, ఆస్తి పన్ను మినహాయింపు వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు రూ.800 కోట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.  

విద్యారంగం పునర్‌నిర్మాణం 
తెలంగాణ విద్యారంగాన్ని పునర్‌ నిర్మించే ప్రక్రియ మొదలైందని భట్టి తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో సాంకేతిక విద్యను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, పరిశ్రమకు నైపుణ్యవంతులైన యువత అవసరం పెరిగిందన్నారు.ఈ దిశగా ఇంజనీర్లను తయారు చేసేందుకు బోధన ప్రణాళికలో మార్పులు తెస్తున్నామని చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో మల్టీ డిసిప్లేనరీ అభ్యాసాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.  

విద్యార్థులు వ్యసనం బాట పట్టొద్దు
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పుస్తకాలు, ల్యాబ్‌లు, మెంటర్‌లు, అవకాశాలకు దగ్గరగా ఉండాలని భట్టి సూచించారు. చదివే సమయం కన్నా, మొబైల్‌ స్క్రీన్‌ చూసే సమయం ఎక్కువైతే డిగ్రీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంజనీరింగ్‌లో సమయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారని, ఒత్తిడిని బ్యాక్‌లాగ్‌లలో కొలుస్తారు అని ఆయన ఉదహరించారు. 

2027 నాటికి భారతదేశంలో వెయ్యికిపైగా యూనికోర్న్‌ స్టార్టప్స్‌ రాబోతున్నాయని, తెలంగాణ ఇందులో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, జేఎనీ్టయూ వీసీ ప్రొఫెసర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సావనీర్‌ను భట్టి ఆవిష్కరించారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)